మేఘాలయలో తీవ్రవాదుల దాడి | NCP Candidate Jonathone N Sangma Killed By Terrorists In Meghalaya | Sakshi
Sakshi News home page

మేఘాలయలో తీవ్రవాదుల దాడి

Published Mon, Feb 19 2018 5:23 AM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM

NCP Candidate Jonathone N Sangma Killed By Terrorists In Meghalaya - Sakshi

షిల్లాంగ్‌: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న మేఘాలయలో ఆదివారం తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) విలియమ్‌ నగర్‌ నియోజకవర్గ అభ్యర్థి జొనాథన్‌ సంగ్మాతోపాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు మృతి చెందారు. తూర్పు గరో జిల్లాలో జరిగిన ఈ ఘటనలో తీవ్రవాదులు తొలుత పేలుడు జరిపి అనంతరం సంగ్మా వాహన శ్రేణిపై కాల్పులకు దిగారు. మేఘాలయ శాసనసభలో ఉన్న మొత్తం 60 స్థానాలకు ఈ నెల 27న పోలింగ్‌ జరగనుండటం తెలిసిందే. మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా మృతులకు సంతాపం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement