Shenzhen
-
ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు కలిగిన నగరం ఏమిటో తెలుసా?
మహానగరాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఆకాశహర్మ్యాలే.. నింగిని తాకేలా ఉండే ఈ భవనాలను చూసి అచ్చెరువొందని వారు ఉండరు. ఇంతకూ మీకీ విషయం తెలుసా? ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు కలిగిన నగరం ఏమిటో? ఏ అమెరికాదో అయి ఉంటుందని అనుకుంటున్నారు కదూ.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యాలు కలిగిన నగరం చైనాలోని షెంజెన్. 200 మీటర్లు(దాదాపుగా 60 అంతస్తులు) అంతకన్నా ఎక్కువ ఎత్తున్న భవనాలు ఇక్కడ 120 ఉన్నాయట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా(828 మీటర్లు) ఉన్న దుబాయ్ తర్వాతి స్థానంలో నిలిచింది. టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బన్ హ్యాబిటాట్ కౌన్సిల్ విడుదల చేసిన జాబితాలో అత్యధికంగా చైనాలోని నగరాలే ఉన్నాయి. 27వ స్థానంలో ముంబై ఉంది. కోల్కతా 199వ స్థానంలో(ఒకే భవనం) ఉంది. షెంజెన్కి సంబంధించి మరో విశేషం ఏమిటంటే.. ఇక్కడ 159 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తున్న 162 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో ఓ 40 భవనాలను ఈ ఏడాదే ప్రారంభించనున్నారు. అంటే.. భవిష్యత్తులో ఈ కేటగిరీలో షెంజెన్ను కొట్టేవాడు లేడన్నమాట. చదవండి: ఇదీ ఆకాశహర్మ్యమే..కానీ మనుషుల కోసం కాదు.. 200 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తున్న భవనాలు కలిగిన నగరాలు(టాప్–10) -
కుక్క,పిల్లి మాంసంపై శాశ్వత నిషేధం
బీజింగ్ : ఎట్టకేలకు చైనాలోని ఒక నగరం కీలక నిర్ణయం తీసుకుంది. కరాళనృత్యం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రయత్నంలో చైనా లోని షెన్జైన్ నగరంలో కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములు, సహా ఇతర అడవి జంతువుల మాంసం తినడాన్ని నిషేధం విధించింది. అంతేకాదు ప్రస్తుత వైరస్ వ్యాప్తి ప్రారంభంలో చైనా ప్రభుత్వం జారీ చేసిన తాత్కాలిక నిషేధానికి మించి అడవి జంతువుల వ్యాపారం, వినియోగాన్ని శాశ్వతంగా నిషేధించింది. కుక్క, పిల్లి మాంస విక్రయాలకు ప్రత్యేకతగా చెప్పుకునే షెన్జెన్ నగరంలో కుక్క, పిల్లి , పాములు, బల్లుల మాంసం వినియోగాన్ని నిషేధించింది. మే 1 నుండి ఈ నిషేధం అమల్లోకి వచ్చేలా నిబంధనలను ప్రవేశపెట్టింది. 'ఆధునిక సమాజానికి సార్వత్రిక నాగరికత అవసరం' అని గుర్తించామని అధికారులు ప్రకటించారు. పిల్లి, కుక్క మాంసం వ్యాపారం, వినియోగాన్ని శాశ్వతంగా నిషేధించిన చైనా మొట్టమొదటి నగరంగా షెన్జెన్ అవతరించింది. ఈ నిషేధాన్ని ఉల్లఘింస్తే జరిమానా భారీగానే వుంటుంది. స్వాధీనం చేసుకున్న జంతువుల విలువను బట్టి గణనీయంగా పెరుగుతుంది. ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న నగరంగా షెన్జెన్ రికార్డుల కెక్కింది. మరోవైపు ఇది చారిత్రాత్మక నిర్ణయంమంటూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ కు చెందిన ప్రముఖుడు డాక్టర్ పీటర్ లి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ మహమ్మారి నుండి నేర్చుకున్న పాఠాలను తీవ్రంగా పరిగణించి, మరొక మహమ్మారిని నివారించడానికి అవసరమైన మార్పులు చేసిన మొట్టమొదటి నగరం షెన్జెన్ అని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ వన్యప్రాణి విభాగం ఉపాధ్యక్షుడు తెరెసా ఎం.టెలికీ అన్నారు. క్రూరమైన వాణిజ్యాన్ని అంతం చేసే ప్రయత్నాలలో షెన్జెన్ విధించిన నిషేధం అభినంద నీయమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం చైనాలో 10 మిలియన్ కుక్కలు , 4 మిలియన్ పిల్లుల మాంసాన్ని విక్రయిస్తారని అంచనా వేశారు. కాగా సెంట్రల్ చైనా నగరమైన వుహాన్లో గత ఏడాది డిసెంబరులో మొట్టమొదట కరోనా వైరస్ ను గుర్తించారు. వూహాన్ నగరంలో జంతు వధశాల కేంద్రంగా ఈ వైరస్ వ్యాపించిందనే వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కుక్క మాంసం వ్యాపారం జరిగే చైనాలోని నగరాల్లో షెన్జెన్ ఐదవ అతిపెద్ద నగరం. 12.5 మిలియన్ల జనాభా ఇక్కడ నివసిస్తారు. తైవాన్, హాంకాంగ్ దేశాల్లోనూ వీటి మాంసం విక్రయాలను నిషేధించిన సంగతి తెలిసిందే. -
షెన్జెన్లో అన్నీ విద్యుత్తు వాహనాలే!
ఢిల్లీలో పొగ కాలుష్యం... స్కూళ్లకు సెలవు.. సరి బేసి విధానంలో వాహనాలు.. ఇలా నానా తంటాలు పడుతున్నామా? చైనా మాత్రం ఈ వాయు కాలుష్యం సమస్యకు తనదైన శైలిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికల్లా చైనాలోని షెన్జెన్లోని ప్రతి సిటీబస్సు విద్యుత్తుతో నడిచేదే అవనుంది! పారిశ్రామిక వాడలు బోలెడన్ని ఉన్న షెన్జెన్లో ఇప్పటికి దాదాపు 14000 విద్యుత్తు బస్సులను ఏర్పాటు చేయగా.. మిగిలిన డీజిల్ బస్సులను కూడా ఏడాది చివరలోగా మార్చేస్తామని అంటోంది చైనా. 2011 నుంచి విద్యుత్తు వాహనాలపై ప్రయోగాలు చేస్తోంది బీవైడీ అనే సంస్థ. ఒకప్పుడు అనామకంగా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లోని 200 నగరాలకు విద్యుత్తు వాహనాలను సరఫరా చేస్తోంది. భూ తాపోన్నతి కారణంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రపంచంలోని పలు దేశాలిప్పుడు విద్యుత్తుతో నడిచే వాహనాలపై శ్రద్ధపెడుతున్న విషయం తెలిసిందే. భారత్ విషయాన్నే తీసుకుంటే అసోం రాష్ట్రంలో ఇటీవలే అక్కడి రవాణా సంస్థ టాటా మోటర్స్ అభివృద్ధి చేసిన విద్యుత్తు బస్సులను కొనుగోలు చేసింది. -
ఆ శిథిలాల కింద 58 మృతదేహాలు వెలికితీత
బీజింగ్: చైనాలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో శిథిలాలకింద 58 మృతదేహాలు గుర్తించినట్లు చైనా అధికారులు బుధవారం వెల్లడించారు. వీరిలో 52 మందిని గుర్తించినట్లు చెప్పారు. చైనాలోని షెంజెన్ అనే ప్రాంతంలో ఒక్కసారి భారీ మొత్తంలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 77మంది కనిపించకుండా పోగా వారికోసం సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 18 రోజులపాటు ఈ సహాయక చర్యలు చేపట్టి శిథిలాలు తొలగించి వాటికిందపడిన మొత్తం 58 మృతదేహాలను వెలికి తీశారు.