Myanmar jad Mine Landslide: One Dead at least 70 missing - Sakshi
Sakshi News home page

విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు

Published Wed, Dec 22 2021 2:51 PM | Last Updated on Wed, Dec 22 2021 3:30 PM

Myanmar jad Mine Landslide: One Dead at least 70 missing  - Sakshi

Myanmar jad Mine Landslide: ఉత్తర మయన్మార్‌లో కచిన్ రాష్ట్రంలోని హ్పాకాంత్ ప్రాంతంలో ఉన్న జాడే గనుల్లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 70 మంది గల్లంతవ్వగా, ఒకరు మృతి చెందారు. రెస్క్యూ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

(చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్‌ క్యూర్‌ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!)

జాడే గనులు ప్రపంచంలోనే ప్రసిద్ధింగాంచిన అతి పెద్దగనులు. అయితే లారీల నుండి ఓపెన్ పిట్ గనులకు విసిరిన శిథిలాలు గుట్టలుగా పొంగిపొర్లడంతో కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు. ఈ గనుల్లోని ఖనిజాలు సేకరించడం అ‍త్యంత ప్రమాదకరమైన శ్రమతో కూడిన పని. నిజానికి ప్రమాదాలు తరుచుగా సంభవించడంతో హ్పాకాంత్‌లో జాడే మైనింగ్‌ని నిషేధించారు. కానీ స్థానికులకు ఉపాధి లేకపోవడం, మరోవైపు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దిగజారుతున్న వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. 

(చదవండి: అతి పెద్ద విడాకుల సెటిల్‌మెంట్‌..రూ. 5, 500 కోట్ల భరణం!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement