jade mine
-
విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు
Myanmar jad Mine Landslide: ఉత్తర మయన్మార్‌లో కచిన్ రాష్ట్రంలోని హ్పాకాంత్ ప్రాంతంలో ఉన్న జాడే గనుల్లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 70 మంది గల్లంతవ్వగా, ఒకరు మృతి చెందారు. రెస్క్యూ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. (చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!) జాడే గనులు ప్రపంచంలోనే ప్రసిద్ధింగాంచిన అతి పెద్దగనులు. అయితే లారీల నుండి ఓపెన్ పిట్ గనులకు విసిరిన శిథిలాలు గుట్టలుగా పొంగిపొర్లడంతో కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు. ఈ గనుల్లోని ఖనిజాలు సేకరించడం అత్యంత ప్రమాదకరమైన శ్రమతో కూడిన పని. నిజానికి ప్రమాదాలు తరుచుగా సంభవించడంతో హ్పాకాంత్‌లో జాడే మైనింగ్‌ని నిషేధించారు. కానీ స్థానికులకు ఉపాధి లేకపోవడం, మరోవైపు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దిగజారుతున్న వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. (చదవండి: అతి పెద్ద విడాకుల సెటిల్మెంట్..రూ. 5, 500 కోట్ల భరణం!) -
మయన్మార్‌లో గని వద్ద ఘోర ప్రమాదం
యాంగూన్: మయన్మార్‌లోని ఓ గనివద్ద మట్టి కుప్పలు విరిగిపడిన ఘటనలో 162 మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని స్థానికులు అంటున్నారు. కచిన్ రాష్ట్రం హపకంట్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాయి (జేడ్) గని ఉంది. ఈ గని నుంచి భారీ యంత్రాలతో తవ్వి తీసిన మట్టిని ఆ పక్కనే పోస్తుంటారు. కార్మికులు అక్కడే తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ మట్టిగుట్ట కార్మికుల నివాసాలపై పడటంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 162 మృతదేహాలను వెలికితీసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలో 113 మంది మృత్యువాత పడ్డారు. అక్రమంగా జరిగే జేడ్ గనుల తవ్వకాలతో మాజీ సైనిక పాలకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. -
కొండచరియలు విరిగిపడి 50 మంది మృతి
మయన్మార్ : మయన్మార్ : ఉత్తర మయన్మార్‌లోని జాడే గని వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 113 మంది మరణించారు. కాచిన్ రాష్ట్రంలోని జాడే-రిచ్ హపకాంత్ ప్రాంతంలో రాళ్ళు సేకరిస్తున్నప్పుడు భారీ వర్షం కారణంగా గురువారం కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా వీరిలో మైనర్లు ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మట్టిదిబ్బలో చాలా మంది చిక్కుకుపోయారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక విభాగం ఓ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ప్రమాద సమయంలో 38 ఏళ్ల మౌంగ్ ఖాన్ అనే వ్యక్తి రన్.. రన్ అంటూ అరుస్తూ మిగిలిన వాళ్లని అప్రమత్తం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ అతను అక్కడే మట్టిదిబ్బల్లో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన వీడియో ఫుటేజీలో రికార్డు అయ్యింది. (హెచ్1 బీ వీసాదారులకు బిడెన్ తీపి కబురు ) హప్‌కాంత్ గనులలో ఇటీవలి వరుసగా కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయతే గత ఐదేళ్లనుంచి జరిగిన ప్రమాదాల్లో ఇది అత్యధికం. 21015లో కూడా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలను మూసివేయాలని పలువురు డిమాండ్ చేశారు. అప్పట్లో తాత్కాలికంగా ఇది మూతపడ్డా వెంటనే మళ్లీ పరిశ్రమలు తెరుచుకున్నాయి. పేదరికాన్ని అడ్డుపెట్టుకొని కొందరు మైనర్లను పనిలో పెడతారని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయినా, అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడి మీడియా నివేదించింది. ఈ ప్రాంతంలో మైనింగ్ అమ్మకాలు జోరుగా సాగుతాయని ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2016-17లో మయన్మార్‌లో అత్యధికంగా 671 మిలియన్ యూరోలు (750.04 మిలియన్ డాలర్లు) వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. (కరోనా : వ్యాక్సిన్ అవసరం ఉండకపోవచ్చు ) -
కొండ చరియలు విరిగిపడి 60 మంది మృతి
-
కొండ చరియలు విరిగిపడి 60 మంది మృతి
యంగూన్ : మయన్మార్‌లో విషాదం చోటు చేసుకుంది. కచిన్ జిల్లా పచ్చరాతి గనుల్లో శనివారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 60 మంది మృతి చెందారు. మరో 100 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా శిథిలాల కింద చిక్కుకున్న ఉంటారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ క్రమంలో వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన పచ్చరాతి గనులు ఈ ప్రాంతంలో ఉన్న విషయం విదితమే.