తిరువనంతపురం : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్ర గురువారం (ఆగస్ట్1) కేరళలో కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లో చూరల్‌మల ప్రాంతాన్ని సందర్శించారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన స్థానికుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
భారీ వర్షాల కారణంగా మంగళవారం వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 256 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటంతో కేరళ జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
LoP Shri @RahulGandhi & AICC General Secretary Smt. @priyankagandhi ji visit the Chooralmala landslide site in Wayanad where devastating landslides have claimed many lives and left families devastated.
📍 Kerala pic.twitter.com/EnPakO8tJC— Congress (@INCIndia) August 1, 2024
కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ సుమారు 1,000 మందిని రక్షించింది . 220 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వయనాడ్ వరదల నుంచి ప్రజల నుంచి భద్రతా బలగాలు చేస్తున్న సహాయక చర్యలు గురువారానికి మూడోరోజుకి చేరుకున్నాయి.
హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్‌ఎడిఆర్) ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఆర్మీ కోజికోడ్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం కనీసం 1,500 మంది ఆర్మీ సిబ్బందిని, ఫోరెన్సిక్ సర్జన్లను నియమించామని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
రానున్న రెండు రోజుల్లో వయనాడ్‌తో పాటు ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment