
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఓ రోడ్డు కుప్పకూలింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవోంతా సాహిబ్, షిల్లై–హట్కోరీని అనుసంధానించే ఈ ఘాట్ రోడ్డుపై నహన్ పట్టణం సమీపంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారి 100 మీటర్ల పొడవునా దిగువకు జారిపోయింది. ప్రస్తుతం అక్కడ మట్టి, రాళ్లు తప్ప రోడ్డు ఆనవాళ్లే కనిపించడం లేదు. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపోయాయి. భీకర వర్షాలతోపాటు కొండ చరియలు విరిగిపడుతుండడంలో హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్–స్పితీలో 200 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment