కొద్ది రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా అసోంలోని కంరూపా జిల్లా అమిన్ గావ్ ప్రాంతంలో మంగళవారం కొండచరియలు విరిపడి తల్లీకూతుళ్లు మృతిచెందారు.
రాంగియా: కొద్ది రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా అసోంలోని కంరూపా జిల్లా అమిన్ గావ్ ప్రాంతంలో మంగళవారం కొండచరియలు విరిపడి తల్లీకూతుళ్లు మృతిచెందారు.
ప్రమాద స్థలానికి సమీపంలోనే ఎన్డీఆర్ఎఫ్ క్యాంపు ఉంది. విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తల్లీ, చిన్నారిల మృతదేహాలను వెలికితీశారు. కాగా, చనిపోయిన మహిళపేరు సుమితా కక్లారీ అని, ఆమె కుమారుడిపేరు రశ్మీ అని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.