వయనాడ్‌ విలయం: ప్రకృతి ప్రకోపం.. శిథిలాల కింద నుంచి ఫోన్లు.. వీడియోలు చూశారా? | Landslide In Wayanad Several Houses Damaged videos show | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ విలయం: ప్రకృతి ప్రకోపం.. శిథిలాల కింద నుంచి ఫోన్లు.. వీడియోలు చూశారా?

Published Tue, Jul 30 2024 1:07 PM | Last Updated on Tue, Jul 30 2024 3:06 PM

Landslide In Wayanad Several Houses Damaged videos show

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. సహాయక చర్యలు ముందుకు సాగుతున్నా కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రాణాలతో బయటపడిన వాళ్లు దేవుడ్ని తలుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అయితే ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

 

శిథిలాల కింది నుంచే ఫోన్లు.. 
అర్ధరాత్రి చిమ్మచీకట్లో కొండచరియలు, బురద విరుచుకుపడటంతో వయనాడ్‌ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. చాలామంది బాధితులు శిథిలాల కింద నుంచి ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని ప్రాధేయపడ్డారు. ‘‘ఇల్లు మొత్తం పోయింది. మా వాళ్లు ఎక్కడ ఉన్నారో అర్థం కావడంలేదు. ఎవరో ఒకరు వచ్చి సాయం చేయండి’’ అంటూ ఓ మహిళ ఫోన్‌ కాల్‌ను అక్కడి టీవీ చానెల్స్‌ ప్రసారం చేశాయి. ఇల్లు, అయినవాళ్లు కనిపించక రోదిస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. 

 

 225 మంది భారత ఆర్మీ బృందం రెస్య్కూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. విపత్తు జరిగిన ప్రదేశంలో కీలకమైన వంతెన కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఈ ఘటనలో ముండక్కై గ్రామం ఊడ్చిపెట్టుకుపోయింది. చూరల్‌మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలు ధ్వంసం అయ్యాయి. సమీపంలోని గ్రామాల్లో అనేక ఇళ్లు ధ్వసం అయ్యాయి. భారీ వరదలతో అనేక భవనాలు నీటీలో మునిగి దెబ్బతిన్నాయి. వీటికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement