గ్వాటెమాలా సిటీ : భారీ వర్షాలు,ఈదురు గాలులతో గ్వాటెమాలా నగరం అతలాకుతలమైంది. నగర శివారు ప్రాంతంలో కొండ చెరియలు విరిగిపడ్డాయి. దాంతో 30 మంది మరణించారు. మరో 600 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు గ్వాటెమాలా జాతీయ విపత్తు సహకార సంస్థ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. అయితే గల్లంతైన వారు సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు అని తెలిపారు.
గురువారం రాత్రి నుంచి ఎడతేరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భారీ కొండ చరియలు విరిగిపడ్డాయని చెప్పారు. అయితే శిథిలాల కింద చిక్కిన 36 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఉన్నతాధికారి పేర్కొన్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.