Guatemala City
-
ప్రకృతి బీభత్సం; గగుర్పొడిచే దృశ్యాలు
గ్వాటెమాలా సిటీ: ప్యూగో అగ్నిపర్వతం సృష్టించిన విలయం నుంచి గ్వాటెమాలా ఇప్పుడప్పుడే కోలుకునేలా లేదు. అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో ఇప్పటివరకున్న అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 90కి పెరిగింది. లావాతో పేరుకుపోయిన శిథిలాల కింద కనీసం 200 మంది సజీవసమాధి అయి ఉంటారని అంచనా. వాయువేగంతో ఉప్పెనలా దూసుకొచ్చిన లావా... లాస్ లోటెస్, శాన్మిగుయెల్, ఎల్రోడియో తదితర ప్రాంతాలను ముంచెత్తింది. (ఉప్పొంగిన లావా.. శవాల దిబ్బలుగా ఊళ్లు) శాటిలైట్ ఫొటోల్లో ప్రకృతి బీభత్సం: గ్వాటెమాలాలోని ప్యూగో అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సానికి సంబంధించి శాటిలైట్లు చిత్రీకరించిన ఫొటోలు విడుదలయ్యాయి. కొద్ది నెలల కిందట ఆ ప్రాంతం ఎలా ఉండేదో.. అగ్నిపర్వతం బద్దలై, లావా ముంచెత్తిన తర్వాత ఎలా తయారైందో స్పష్టంగా కనిపిస్తుంది. శాటిలైట్ ఫొటోలు(ప్యూగో సమీప గ్రామం): ఫిబ్రవరి 5న అలా, జూన్ 6న ఇలా) కొనసాగుతోన్న సహాయక చర్యలు: ఆదివారం అగ్నిపర్వతం బద్దలుకాగా బుధవారం నాటికి వేడిమి కాస్త తగ్గింది. దీంతో పెద్ద ఎత్తున సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శిథిలాలను తొలగిస్తూ, మృతదేహాలను గుర్తించేపని చేపట్టామని, చాలా వరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని, శిథిలాల తొలగింపు ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. శిబిరాల్లో తలదాచుకున్న మూడు గ్రామాల నిర్వాసితులు ఇంకొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి. (ఏప్రిల్ 7 నాటి ఫొటో, జూన్ 6 నాటికి ఇలా) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉప్పొంగిన లావా.. శవాల దిబ్బలుగా ఊళ్లు
గ్వాటెమాలా: కమ్ముకొచ్చిన బూడిద.. ఉవ్వెత్తున్న ఎగసిపడ్డ లావా... అక్కడి ఊళ్లన్నింటిని కప్పేసి శవాల దిబ్బలుగా మార్చేశాయి. మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఫ్యూగో అగ్నిపర్వతం సృష్టించిన భీభత్సంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. రాజధాని గ్వాటెమాలా సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఆదివారం ఒక్కసారిగా లావాను ఎగజిమ్మింది. ఇప్పటిదాకా మొత్తం 65 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. మరో వంద మంది తీవ్రంగా గాయపడగా, 45 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. లావా వేడి వల్ల సహాయక సిబ్బంది ఓ గ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ జాతీయ విపత్తు అధికారి కూడా మృతి చెందినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఊహించని రీతిలో... ఆదివారం అగ్నిపర్వతం బద్ధలయ్యాక భారీగా బూడిద వెలువడింది. లావా కంటే వేగంగా దుమ్ము ధూళితో కూడిన బూడిద గ్రామాలపై విరుచుకుపడింది. ఈ దశలో ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అగ్ని పర్వతం బద్ధలైన విషయం అర్థమయ్యే లోపు లావా ఊళ్లను ముంచెత్తింది. మనుషులతోపాటు మూగ జీవాలు కూడా పెద్ద ఎత్తున్న సజీవ దహనం అయ్యాయి. హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సహాయక చర్యలు.. ఘోర ప్రమాదం అనంతరం గ్వాటెమాలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సమీప గ్రామాలకు చెందిన 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చన్న ప్రకటనతో తమ వారి కోసం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు జిమ్మీ మోరెల్స్.. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. 1974 తర్వాత సంభవించిన అతిపెద్ద అగ్నిపర్వత పేలుడు ఇదేనని నిపుణులు చెబుతున్నారు. (సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు)... -
కొండ చరియలు విరిగి పడి 30 మంది మృతి
గ్వాటెమాలా సిటీ : భారీ వర్షాలు,ఈదురు గాలులతో గ్వాటెమాలా నగరం అతలాకుతలమైంది. నగర శివారు ప్రాంతంలో కొండ చెరియలు విరిగిపడ్డాయి. దాంతో 30 మంది మరణించారు. మరో 600 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు గ్వాటెమాలా జాతీయ విపత్తు సహకార సంస్థ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. అయితే గల్లంతైన వారు సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు అని తెలిపారు. గురువారం రాత్రి నుంచి ఎడతేరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భారీ కొండ చరియలు విరిగిపడ్డాయని చెప్పారు. అయితే శిథిలాల కింద చిక్కిన 36 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఉన్నతాధికారి పేర్కొన్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. -
గ్వాటెమలలో బస్సు ప్రమాదం: 35 మంది మృతి
గ్వాటెమల నగర సమీపంలోని అత్యంత ఎత్తేన ప్రదేశంలో ప్రయాణిస్తున్న బస్సు ఆదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 35 మంది ప్రయాణికులు మరణించారని ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. ఆ ప్రమాదం నిన్న చోటు చేసుకన్న సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని వివరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మరో 50 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.వారు గ్వాటెమల నగరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. బస్సు బ్రేకులు సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఆ దుర్ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.