ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి నడక మార్గంలో నేటి ఉదయం (ఆదివారం) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండలపై నుంచి పడిన రాళ్ల కారణంగా ముగ్గురు యాత్రికులు మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకూ శిథిలాల నుంచి ముగ్గురు యాత్రికుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్రకు చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. కేదార్‌నాథ్ యాత్రా మార్గం సమీపంలో కొండపై నుండి పడుతున్న రాళ్ల కారణంగా కొందరు యాత్రికులు మృతిచెందారన్న వార్త చాలా బాధ కలిగిందని సీఎం పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు సూచనలు జారీ చేశారు.
జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 7.30 గంటలకు కేదార్‌నాథ్ యాత్రా మార్గంలోని చిర్బాసా సమీపంలోని కొండపై నుండి పడిన భారీ రాళ్ల కారణంగా యాత్రికులు సమాధి అయినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఎన్‌డిఆర్‌ఎఫ్, డిడిఆర్, వైఎంఎఫ్ అడ్మినిస్ట్రేషన్ బృందంతో సహా యాత్రా మార్గంలోని భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారన్నారు. రెస్క్యూ టీమ్ శిథిలాల నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసిందని, గాయపడిన ఎనిమిది మందిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment