Himachal Landslide Nightmare For 200 Tourists, Causes 15-Kilometer Traffic Jam - Sakshi
Sakshi News home page

Himachal Pradesh Landslides:15 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌.. రాత్రంతా రోడ్డుమీదే.. దారుణంగా పర్యాటకుల పరిస్థితి

Published Mon, Jun 26 2023 4:58 PM | Last Updated on Mon, Jun 26 2023 7:23 PM

Himachal Landslide Nightmare For 200 Tourists Due To Traffic Jam - Sakshi

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతోంది. కుండపోతగా కురిసిన వర్షాలతో నదుల్లో వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. అటు భారీగా  కురిసిన వర్షాలతో కొండ చరియలు రహదారులపై విరిగిపడ్డాయి. దీంతో మండి, కులును కలిపే జాతీయ రహదారిని బ్లాక్‌ చేశారు పోలీసులు.  భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. 

కొండ చరియలు విరిగిపడిన కారణంగా మండీలోని చండీగఢ్‌-మనాలీ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నత్తనడకన కదులుతున్న వాహనాలతో పర్యటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 200 మంది పర్యటకులు రాత్రంతా రోడ్లపైనే ఉండిపోయారు. ముందుకు వెళ్లలేక వెనకకు మళ్లలేక పిల్లలతో సహా కుటుంబాలతో కలిసి రోడ్లపైనే ఉన్నామని చెప్పారు. ఇదో పీడకలలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం ఎడతెరిపి లేని వర్షంతో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రెండు జాతీయ రహదారులతోసహా 124 రోడ్లు దెబ్బతిన్నాయని సీనియర్‌ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు. భారీ వర్షాల కారణంగా దాదాపు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. వరదలతో వివిధ జిల్లాల్లో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌.. ఏటా ఇదే పరిస్థితి.. ఎందుకిలా..? 

కొండ చరియలు విరిగిపడగా.. ఆదివారం సాయంత్రం 5 గంటలకే రహదారిని మూసివేశారని పర్యటకులు తెలిపారు. రాత్రంతా రోడ్డుపైనే ఉన్నట్లు చెప్పారు. బస చేయడానికి హోటల్ సౌకర్యం కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. దాదాపు 200 వందల కార్లపైనే వరుసగా ఉండిపోయాయని చెప్పారు.

కొందరు బస్సుల్లో విహారయాత్రకు వచ్చి రాత్రంతా అందులోనే ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విరిగిపడిన కొండ చరియలను రోడ్డుపై నుంచి ఎప్పుడు తొలగిస్తారో.. ఇంకా ఎంత సమయం వేచి ఉండాలో కూడా అధికారులు తెలపట్లేదని చెప్పారు.

ఇదీ చదవండి: Himachal Pradesh Floods: హిమాచల్‌లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement