నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల కొండచరియలు విరిగిపడి కనీసం 98 మంది మరణించారు.
ఖాట్మాండు: నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల కొండచరియలు విరిగిపడి కనీసం 98 మంది మరణించారు. మరో 129 మంది ఆచూకీ కనిపించడం లేదు. వరుసగా నాలుగో రోజు ఆదివారం కూడా నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని నేపాల్ ఉపప్రధాని, హోం శాఖ మంత్రి బామ్ దేవ్ గౌతమ్ చెప్పారు. సాయం కోసం భారత్ను అభ్యర్థించినట్టు తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలకు కోసం భారత్ మూడు హెలీకాప్టర్లు, ఓ విమానం పంపాలని నిర్ణయించింది.