వరద ఉధృతికి 50 మంది పైగా మృతి | Colombia landslide kills dozens in Antioquia province | Sakshi
Sakshi News home page

వరద ఉధృతికి 50 మంది పైగా మృతి

May 19 2015 9:55 AM | Updated on Sep 3 2017 2:19 AM

వరద ఉధృతికి 50 మంది పైగా మృతి

వరద ఉధృతికి 50 మంది పైగా మృతి

వాయువ్య కొలంబియాలోని ఆన్టీక్వీయా ప్రావిన్స్ లో వరద ఉధృతికి 50 మందికి పైగా మృతి చెందారిని అధికారులు చెప్పారు.

కొలంబియా: వాయువ్య కొలంబియాలోని ఆన్టీక్వీయా ప్రావిన్స్ లో వరద ఉధృతికి 50 మందికి పైగా మృతి చెందారిని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు వరదల కారణంగా  కనపడకుండా పోయిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జూవాన్ మానుల్ సాంటోస్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా లిబోరియానా నది ఉదృతంగా ప్రవహించడంతో మట్టి పెల్లలు విరిగి పడి ఈ దుర్ఘటన జరిగింది.

 

క్షతగాత్రులను కాపాడటానికి రెస్య్కూటీం లు విరామంలేకుండా కృషి చేస్తున్నాయి. విపత్తు జరిగిన ప్రాంతాన్ని సాంటోస్ సందర్శించిన అనంతరం  జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement