వయనాడ్‌ విపత్తు: స్పందించిన ప్రధాని మోదీ | Wayanad Landslide: PM Modi Reacts And Announces Ex-Gratia | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ విపత్తు: స్పందించిన ప్రధాని మోదీ

Published Tue, Jul 30 2024 9:10 AM | Last Updated on Tue, Jul 30 2024 10:12 AM

Wayanad Landslide: PM Modi Reacts And Announces Ex-Gratia

ఢిల్లీ: కేరళలోని వయనాడ్‌ జిల్లా మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది మృతిచెందారు. మృతుల్లో  ఒక చిన్నారి, ఒక విదేశీయుడు ఉన్నారు. ఈ ఘటనపై   ప్రధాన మంత్రి మోదీ స్పందిచారు. ‘వయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం బాధ కలిగించింది. ఈ ఘటనలో గాయపడిన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నా. బాధితులకు సహాయం చేయడానికి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌లు జరుగుతున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడాను.  ఆయన అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

 

అదే విధంగా వయనాడ్‌ విపత్తులో మరణించినవారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారికి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు,  గాయపడినవారికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కేరళ సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన రాహుల్‌ గాంధీ
వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనపై మాజీ వయనాడ్‌ మాజీ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందించారు.  

‘‘కొండచరియలు విరగినపడిన ఘటన తెలిసి చాలా బాధపడ్డాను. కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని హామీ ఇచ్చారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని కోరాను. సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని వారికి  విజ్ఞప్తి చేశాను. అదేవిధంగా కేంద్ర మంత్రులతో మాట్లాడి వాయనాడ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తాను. సహాయక చర్యల్లో యూడీఎఫ్‌  కార్యకర్తలందరూ పాల్గొనాలని కోరుతున్నాను’’ అని ఎక్స్‌లో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement