kearala
-
వయనాడ్ విపత్తు: స్పందించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది మృతిచెందారు. మృతుల్లో ఒక చిన్నారి, ఒక విదేశీయుడు ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి మోదీ స్పందిచారు. ‘వయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం బాధ కలిగించింది. ఈ ఘటనలో గాయపడిన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నా. బాధితులకు సహాయం చేయడానికి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడాను. ఆయన అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.PM Narendra Modi tweets, "Distressed the landslides in parts of Wayanad. My thoughts are with all those who have lost their loved ones and prayers with those injured. Rescue ops are currently underway to assist all those affected. Spoke to Kerala CM Pinarayi Vijayan and also… pic.twitter.com/y12areB2mw— ANI (@ANI) July 30, 2024 అదే విధంగా వయనాడ్ విపత్తులో మరణించినవారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.Prime Minister announced an ex-gratia of Rs. 2 lakhs from PMNRF for the next of kin of each deceased in the landslides in parts of Wayanad. The injured would be given Rs. 50,000. pic.twitter.com/iDy1Kgaqv2— ANI (@ANI) July 30, 2024కేరళ సీఎంతో ఫోన్లో మాట్లాడిన రాహుల్ గాంధీవాయనాడ్లోని మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనపై మాజీ వయనాడ్ మాజీ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందించారు. ‘‘కొండచరియలు విరగినపడిన ఘటన తెలిసి చాలా బాధపడ్డాను. కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని హామీ ఇచ్చారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని కోరాను. సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని వారికి విజ్ఞప్తి చేశాను. అదేవిధంగా కేంద్ర మంత్రులతో మాట్లాడి వాయనాడ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తాను. సహాయక చర్యల్లో యూడీఎఫ్ కార్యకర్తలందరూ పాల్గొనాలని కోరుతున్నాను’’ అని ఎక్స్‌లో తెలిపారు.Wayanad landslide | Lok Sabha LoP and former MP from Wayanad, Rahul Gandhi tweets, "I am deeply anguished by the massive landslides near Meppadi in Wayanad...I have spoken to the Kerala Chief Minister and the Wayanad District Collector, who assured me that rescue operations are… pic.twitter.com/qqu7VLH4XN— ANI (@ANI) July 30, 2024 -
‘ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు మార్చాలి’
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) 18వ లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) డిమాండ్ చేస్తోంది. ఈమేరకు ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిపింది. కారణం ఇదే.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు తేదీలు శుక్రవారం వస్తాయి. దీంతో ఎన్నికల తేదీలను మార్చాలని ఐయూఎంఎల్ డిమాండ్ చేస్తోంది. శుక్రవారం ముస్లింలకు ముఖ్యమైన రోజు కాబట్టి ఓటర్లు, అధికారులు, అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను మార్చాలని ఈసీఐని ఆశ్రయించనున్నట్లు యూడీఎఫ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మిత్రపక్షమైన ఐయూఎంఎల్ తెలిపింది. ఐయూఎంఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలామ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రార్థనల కోసం మసీదులలో గుమిగూడే ముస్లింలకు శుక్రవారం ముఖ్యమైన రోజు అన్నారు. “శుక్రవారం పోలింగ్ నిర్వహణ ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఈసీఐని ఆశ్రయిస్తాం” అని సలామ్ పేర్కొన్నారు. ఐయూఎంఎల్‌తోపాటు ఇతర ముస్లిం సంస్థలు కూడా ఎన్నికల తేదీల మార్పు కోసం ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో షాకింగ్ ఘటన!
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసిందే. అత్యంత ధనిక ఆలయం అందులోని నేలమాళిగల్లో రాశుల కొద్ది బంగారు, వజ్రవైఢూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయంటూ వార్తల్లో నిలిచింది కూడా. ఈ గుడికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. దేవస్థానానికి సంబంధించిన సరస్సులో 'బబియా' అనే శాకాహార మొసలి ఉంటుందని, అది భక్తులు ఇచ్చే పండ్లు, ఫలాహారాలు తప్ప ఇంకేదీ తినదని చెబుతుంటారు. గుడికి వచ్చే పర్యాటకులు ఈ మొసలిని చూసేందుకు తెగ ఆసక్తి కనబరిచేవారు. ఎన్నో ఏళ్లుగా ఆ చెరువులో ఉంటోన్న 'బబియా'.. గత ఏడాది అక్టోబర్ 9, 2022న మరణించిన సంగతి తెలిసిందే. అయితే విచిత్రంగా.. చనిపోయిన 'బబియా' స్థానంలో మరో కొత్త మొసలి ప్రత్యక్షమైందన్న వార్త ఇప్పుడూ హాట్ టాపిక్‌గా మారింది. ఓ మిస్టరీలా మరో మొసలి.. బబియా' మరణించిన ఏడాది తర్వాత మరో మొసలి 4 రోజుల క్రితం అనూహ్యంగా కనపడింది. నవంబర్ 8న సరస్సు వెంబడి ఉన్న ఒక గుహలో ఈ కొత్త మొసలిని కొందరు భక్తులు గుర్తించారు. ఈ విషయం కాస్తా అధికారులకు వరకు చేరడంతో వారు శనివారం ఆ మొసలిని గుర్తించి.. ఆలయ ప్రధాన పూజారికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఐతే ఇది చిన్న మొసలని, ఆలయ పూజారికి విషయం తెలియజేశాం కాబట్టి తదుపరి ఏ చెయ్యాలో ఆయనే నిర్ణయిస్తారని అన్నారు. ఇలా ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కనబడటం అనివార్యంగా జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికి మిస్టరీగానే ఉంది. కాగా, ఇంతకు ముందు చనిపోయిన బబియా అనే మొసలి మూడోది. దీని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడూ ఈ సరస్సులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని ఆంగ్లేయులు కాల్చి చంపేయగా తదుపది ఆ సరస్సులో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. అయితే ఈ బబియా శాకాహారి, ఆలయ పూజారి పెట్టే ప్రసాదంతోనే జీవించేది. ఎవరికి హాని తలపెట్టేది కాదు. పైగా ఆ సరస్సులో ఉండే చేపలను కూడా ముట్టదు బబియా. దీనికి "బబియా" అని పేరు ఎవరూ పెట్టారో కూడా ఎవ్వరికీ తెలియదు. అత్యంత గమ్మత్తైన విషయం ఏంటంటే.. . ఈ బబియా అంత్యక్రియలు చూడటానికి రాజకీయ నాయకులతో సహా వేలాది మంది భక్తులు తరలిరావడం కూడా చర్చనీయాంశమయ్యింది. మళ్లీ ఆ మొసలి స్థానంలో మరో మొసలి రావడం అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక భాగవత పురాణంలోని గజేంద్ర మోక్ష కథను గుర్తు చేస్తోంది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం విచిత్రం అయితే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం. (చదవండి: దీపావళిని హిందువుల తోపాటు ఎవరెవరూ జరుపుకుంటారంటే..?) -
WC 2023: చోటు ఆశించి భంగపడ్డ సంజూ.. టీ20 జట్టు కెప్టెన్‌గా..
Sanju Samson: వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు ఆశించి భంగపడిన టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో కేరళ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్లో సంజూకు రోహన్ కన్నుమ్మాళ్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 6 వరకు ఈ ఈవెంట్ జరుగనుంది. ఇందులో భాగంగా గ్రూప్-బిలో ఉన్న కేరళ ముంబైలో హిమాచల్ ప్రదేశ్ జట్టుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఆసియా కప్-2023లో బ్యాకప్ ప్లేయర్‌గా ఇక ఈ గ్రూపులో కేరళ, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు సిక్కిం, అసోం, బిహార్, చండీగఢ్, ఒడిశా, సర్వీసెస్ టీమ్‌లు పోటీపడనున్నాయి. కాగా ఆసియా వన్డే కప్-2023లో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఎంపికైన సంజూ శాంసన్.. రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్ జట్టు ఎంపిక సమయంలోనూ బీసీసీఐ సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. 50 ఓవర్ల ఫార్మాట్లో మెరుగైన రికార్డు ఉన్న ఈ కేరళ వికెట్ కీపర్‌ను కాదని.. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు. సూర్యకు పెద్దపీట.. మేనేజ్మెంట్ అండదండలు వన్డేల్లో వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్న ఈ నంబర్ 1 టీ20 బ్యాటర్ కోసం సంజూను బలిచేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో వరుస అర్ధ శతకాలతో రాణించిన సూర్యకు మేనేజ్మెంట్ అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషం(సెప్టెంబరు 28వరకు జట్టులో మార్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో)లోనైనా అద్భుతం జరుగుతుందని ఆశించిన సంజూ శాంసన్ అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో సంజూ తిరిగి మైదానంలో దిగనున్నాడు. దేశవాళీ టీ20 జట్టు కెప్టెన్‌గా మరోసారి ఇక ఈ టీ20 ఈవెంట్ కోసం కేరళ పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గత నెలలో కర్ణాటక టీమ్ నుంచి వైదొలిగిన ఆల్‌రౌండర్ శ్రేయస్ గోపాల్ ఈసారి కేరళకు ఆడనున్నాడు. స్పిన్ దళానికి అతడు నాయకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో కేరళ జట్టుకు ఈ సీజన్లో తమిళనాడు మాజీ క్రికెటర్ ఎం.వెంకటరమణ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీకి కేరళ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహన్ కన్నుమ్మాళ్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ గోపాల్, జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, మహ్మద్ అజారుద్దీన్, విష్ణు వినోద్, అబ్దుల్ బాసిత్, సిజోమోన్ జోసెఫ్, వైశాఖ్ చంద్రన్, బాసిల్ థంపి, కేఎం ఆసిఫ్, వినోద్ కుమార్, మను కృష్ణన్, వరుణ్ నయనార్, ఎం. అజ్నాస్, పీకే మిథున్, సల్మాన్ నిసార్. చదవండి: WC 2023- Ind vs Pak: అతడి బ్యాటింగ్ అంతగొప్పగా ఏమీ ఉండదు.. షమీని ఆడించండి! 👉 సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పాము చర్మం...షాక్‌లో కస్టమర్
Snake skin found in food: ఇటీవల కోవిడ్ -19 తర్వాత ప్రజలు నేరుగా రెస్టారెంట్‌కి వెళ్లి తినడాని కంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తినడానికే ఇష్టపడుతున్నారు. అదీగాక జోమాటో, స్వీగ్గీ వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ యూప్‌లు ప్రజలకు వెసులుబాటు కలిగించేలా మంచి డిస్కోంట్లు ఇచ్చి మరీ సేవలందింస్తుంది. వీకెండ్ సమయాల్లో మరింత ఆకర్షీణీయమైన పుడ్ ఆఫర్లతో భోజనప్రియులకు మరింత చేరువవుతోంది. దీంతో ప్రజలు కూడా ఆన్లైన్లో ఫుడ్‌ని ఆర్డర్ చేసుకుని తినడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వారికి ఊహించని భయంకరమైన చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు ఆ ఘటన మళ్లీ ఇంకెప్పుడు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసి తినడానికి జంకేలా చేసింది. వివరాల్లోకెళ్తే...కేరళలోని తిరువనంతపురంలో ప్రియా అనే ఒక మహిళ నెడుమంగడు ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ నుంచి రెండు పరోటాలను ఆర్డర్ చేసింది. పైగా ఆర్డర్ కూడా సకాలంలోనే డెలివరీ అయింది. ఐతే ఆమె మొదటగా తమ కుమార్తెకు పరోటా పెట్టింది. కానీ ఆ తర్వాత ఆ పరోటా పార్మిల్ని ఫ్యాకింగ్ చేసిన కవర్ మీద సుమారు అరవేలు పొడవు అంతా పాము చర్శం చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. దీంతో ఆమె ఆగ్రహం చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే సదరు రెస్టారెంట్ ఆహారాన్ని ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము చర్మం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారి అర్షిత బషీర్ తెలిపారు. అంతేకాదు వంటగదిలో తగినంత వెలుతురు కూడా లేదని సరైన పరిశుభ్రత పాటించకుండా ఆహారం తయారు చేసున్నారని అన్నారు. సదరు రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయడం తోపాటు ఆ రెస్టారెంట్ యజమానికి షాకాజ్ నోటీసులు కూడా పంపించినట్లు వెల్లడించారు. (చదవండి: నిమ్మకాయలతో మామూలుగా ఉండదు.. జైలు అధికారి సస్పెండ్!) -
హదియా నవ్వుతోందిగా...
సాక్షి, తిరువనంతపురం : కేరళ లవ్ జిహాద్ కేసులో బాధితురాలిని తండ్రి హింసిస్తున్నాడన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మహిళా సంఘం స్పష్టత ఇచ్చింది. సోమవారం జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు కొట్టాయంలోని వైకోమ్ గ్రామంలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం బృందం ప్రతినిధి రేఖా శర్మ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆమె చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంది. తండ్రి ఆమెను హింసిస్తున్నాడన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. యువతి తల్లితో కూడా మేం మాట్లాడాం. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు రక్షణగా ఉన్నారు. ఆమె భద్రతకు వచ్చిన ముప్పేం లేదు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ముందు తాను జరిగిందంతా వివరిస్తానని యువతి మాతో చెప్పింది‘‘ అని రేఖా వివరించారు. చివర్లో ఆమె తన సెల్లో హదియా నవ్వుతున్న ఫోటోలను మీడియాకు చూపించటం విశేషం. కాగా, ఇన్నాళ్ల ఈ కేసులో ఉన్నతాధికారులు ఆమెను కలవటం ఇదే తొలిసారి. హదియాను తండ్రి దగ్గరే ఉండాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఉద్యమకారుడు రాహుల్ ఈశ్వర్ రెండు వీడియోలను విడుదల చేయగా.. అందులో తనను తండ్రి హింసిస్తున్నాడంటూ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ వీడియో ఆధారంగా హదియా భర్త షఫిన్ జెహాన్ సుప్రీంలో తాజాగా ఓ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. అఖిల అశోకన్ అనే యువతి గతేడాది డిసెంబర్లో మతమార్పిడి చేసుకుని మరీ షెఫీన్‌ను వివాహం చేసుకోవటం.. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘‘లవ్ జిహాద్ కేసు’’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూడగా.. తండ్రి చెంత ఉన్న యువతిని వచ్చే నెల 27న సుప్రీంకోర్టులో హాజరుపరచాలంటూ కేరళ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. -
'సీఎం నన్ను లైంగికంగా వేధించారు'
తిరువనంతపురం: కేరళ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సరితా నాయర్ కు సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై తీవ్రమైన ఆరోపణలతో ఆమె రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. తనను ఊమెన్ చాందీ లైంగికంగా వేధించారని ఆమె రాసిన లేఖ ప్రతిని ఆసియన్ నెట్ న్యూస్ ఛానల్ వెలుగులోకి తెచ్చింది. 2013, మార్చి 19న రాసినట్టుగా చెబుతున్న ఈ లేఖలో సంచలనాత్మక విషయాలున్నాయి. ఊమెన్ చాందీతో పాటు కేంద్ర మాజీ మంత్రి తనను లైంగికంగా వేధించారని లేఖలో సరిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి లంచం కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ లేఖను అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కు ఆమె ఇవ్వాలనుకున్నారు. ముఖ్యమంత్రి చాందీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. చాందీ కుమారుడు తనను వేధింపులకు గురిచేశారని గతంలో ఆమె ఆరోపించారు. ఈ లేఖ తనదేనని సరితా నాయర్ తెలిపారు. 'ఆ లేఖ నాదే. పోలీసు కస్టడీలో ఉండగా రాశాను. అందులోని విషయాల గురించి చర్చించాలనుకోవడం లేదు. కానీ లేఖలో నేను రాసివన్నీ వాస్తవాలే' అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనపై పథకం ప్రకారం కుట్ర చేశారని చాందీ ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని దించడానికి చివరి ప్రయత్నంగా దీన్ని వర్ణించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని అన్నారు. సోలార్ కుంభకోణంలో సహ నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ గతంలోనూ చాందీపై పలు ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.