పెళ్లి వేడుక వద్ద ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి | Suicide bombing kills six in Nigeria | Sakshi
Sakshi News home page

పెళ్లి వేడుక వద్ద ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి

Published Sat, May 30 2015 8:33 AM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

పెళ్లి వేడుక వద్ద ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి - Sakshi

పెళ్లి వేడుక వద్ద ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి

లాగోస్:  పెళ్లి వేడుకే లక్ష్యంగా ఆత్మాహుతి జరిపిన దాడిలో ఆరుగురు మరణించగా...మరో ముప్పై మంది గాయపడ్డారు. ఈ ఘటన నైజీరియా బొర్నో రాష్ట్రంలోని తాశన్ అల్డీ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారి శనివారం మైదగురిలో వెల్లడించారు.

ఈ ఘటనపై విచారణ జరపుతున్నట్లు చెప్పారు. నైజిరీయాలోని బోకో హరామ్ తీవ్రవాదులు మైదగురి పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. 2014లో దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేసిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement