జంట పేలుళ్లు: 12మంది మృతి | Six killed, 40 injured in multiple blasts in Mardan district in Pakistan's Khyber-Pakhtunkhwa province | Sakshi
Sakshi News home page

జంట పేలుళ్లు: 12మంది మృతి

Published Fri, Sep 2 2016 11:49 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

Six killed, 40 injured in multiple blasts in Mardan district in Pakistan's Khyber-Pakhtunkhwa province

పాకిస్థాన్ : పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని కైబర్ పక్తున్వ ప్రావెన్స్లో శుక్రవారం జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. ఘటనలో మొత్తం 12 మంది మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కోర్డు ఆవరణలో జరిగిన ఈ దాడిలో లాయర్లు, పోలీసులు ఎక్కువ సంఖ్యలో మరణించారు. కొద్ది రోజుల క్రితం లాయర్లను టార్గెట్ చేసుకుని పాక్ లోని ఓ ఆసుపత్రిలో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే.

ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది తామే అని ఇంత వరకు ఎవరు ప్రకటించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement