
కౌలాలంపూర్: మలేసియాలోని సెంట్రల్ సెలంగోర్‌లో గురువారం చిన్న విమానం కూలిన ఘటనలో మొత్తం 10 మంది చనిపోయారు. లంగ్‌క్వావి నుంచి సుబంగ్ విమానాశ్రయం వైపు వస్తున్న ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా విమానం పల్టీలు కొడుతూ రహదారిపై కుప్పకూలింది. రహదారిపై వెళ్తున్న బైక్, కారుపై పడటంతో విమానంలోని 8 మందితోపాటు మరో ఇద్దరు చనిపోయారు. ఘటనకు కారణం తెలియాల్సి ఉంది. విమానం బ్లాక్‌బాక్స్ కోసం గాలింపు జరుగుతోంది.