
రూపొహి(అసోం): అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ వైరు చెరువులో తెగిపడటంతో 10 ఏళ్ల బాలుడితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం నగాన్ జిల్లా ఉత్తర్ ఖాటూల్‌లో జరిగింది. గ్రామంలోని చెరువులో 11 కేవీ హైటెన్షన్ వైరు తెగిపడటం గుర్తించిన గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారమిచ్చారు. తీగలో విద్యుత్ ప్రసారం లేదని అధికారులు చెప్పడంతో గ్రామస్తులు చేపలు పట్టడానికి చెరువులోకి దిగారు. కానీ అకస్మాత్తుగా విద్యుత్ ప్రసారం కావడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో ఆగ్రహించిన స్థానికులు ఆ ప్రాంతంలోని విద్యుత్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్, వాహనాన్ని ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment