hightensionwires
-
బైక్ కోసం టవరెక్కాడు..
సాక్షి,అడ్డగూడూరు : తల్లిదండ్రి తనకు వెంటనే బైక్ కొనివ్వాలని ఓ యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. ఈ ఘటన మండల పరిధిలోని మానాయికుంటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య కుమారుడు బోడ నరేష్ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. బైక్ కొనివ్వాలని కొంతకాలంగా తల్లిదండ్రిని వేధిస్తున్నాడు. వారు అందుకు ఒప్పుకోకపోవడంతో మన్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే గ్రామ పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. తనకు బైక్ కొనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిం చాడు. గమనించిన సమీప రైతులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు అక్కడికి చేరుకుని నరేష్‌ను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. దీంతో తండ్రి నర్సయ్య కలుగజేసుకుని బైక్ కొనిస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగివచ్చాడు. -
చెరువులో విద్యుత్ తీగ; 6 మంది మృతి
రూపొహి(అసోం): అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ వైరు చెరువులో తెగిపడటంతో 10 ఏళ్ల బాలుడితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం నగాన్ జిల్లా ఉత్తర్ ఖాటూల్‌లో జరిగింది. గ్రామంలోని చెరువులో 11 కేవీ హైటెన్షన్ వైరు తెగిపడటం గుర్తించిన గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారమిచ్చారు. తీగలో విద్యుత్ ప్రసారం లేదని అధికారులు చెప్పడంతో గ్రామస్తులు చేపలు పట్టడానికి చెరువులోకి దిగారు. కానీ అకస్మాత్తుగా విద్యుత్ ప్రసారం కావడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో ఆగ్రహించిన స్థానికులు ఆ ప్రాంతంలోని విద్యుత్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్, వాహనాన్ని ధ్వంసం చేశారు. -
హైటెన్షన్ వైర్లు తగిలి వ్యక్తి మృతి
సింహాద్రిపురం: కడప జిల్లా సింహాద్రిపురం మండలం కట్నూరులో హైటెన్షన్ వైర్లు తగిలి ఒక వ్యక్తి మృతిచెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయితే ఈదురుగాలులకు వైర్లు కిందపడ్డాయని అధికారులకు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టం సంభవించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.