
మానాయికుంటలో టవర్ ఎక్కిన నరేష్
సాక్షి,అడ్డగూడూరు : తల్లిదండ్రి తనకు వెంటనే బైక్ కొనివ్వాలని ఓ యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ సృష్టించాడు. ఈ ఘటన మండల పరిధిలోని మానాయికుంటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య కుమారుడు బోడ నరేష్ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. బైక్ కొనివ్వాలని కొంతకాలంగా తల్లిదండ్రిని వేధిస్తున్నాడు. వారు అందుకు ఒప్పుకోకపోవడంతో మన్తాపానికి గురయ్యాడు.
ఈ నేపథ్యంలోనే గ్రామ పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. తనకు బైక్ కొనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిం చాడు. గమనించిన సమీప రైతులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు అక్కడికి చేరుకుని నరేష్‌ను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. దీంతో తండ్రి నర్సయ్య కలుగజేసుకుని బైక్ కొనిస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగివచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment