బీహార్ శరన్ జిల్లాలోని మర్హ్రా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మర్హర్ సమీపంలో పాట్నా నుంచి చాప్రా వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టిందని జిల్ఆ ఎస్పీ భరణ్ కుమార్ సిన్హా వెల్లడించారు.
మృతులను గుర్తించవలసి ఉందని తెలిపారు. అయితే గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని భరణ్ కుమార్ చెప్పారు.