బిహార్ జరిగిన రోడ్డుప్రమాదాలు దసరా పండుగ రోజు తీవ్ర విషాదాన్ని నింపాయి
పట్నా: బిహార్ రోడ్డు ప్రమాదాలు దసరా పండుగ రోజు తీవ్ర విషాదాన్ని నింపాయి. వేర్వేరు సంఘటనల్లో ఆరుగురు చనిపోగా మరో పదమూడు మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న వాహనం.. ట్రాక్టర్ ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఒక బాలిక ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని పట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా చారాపట్టి గ్రామంనుంచి ముంగర్ లో జరగనున్న దసరా ఉత్సవాలను తిలకించేందకు వెళతుండగా జెహానాబాద్ జిల్లా ముంగర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కుటుంబ సంక్షేమ పథకం కింద ఇరవై వేల రూపాయలను చెల్లించనున్నట్టు జిల్లా ఉన్నతాధికారి ప్రకటించారు. క్షతగాత్రులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు.
మరో విషాదం సికారియా గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వ్యాన్ కారు ఢీకొన్న ప్రమాదం పన్నెండేళ్ల బాలుడు అక్కడిక్కడే ప్పాణాలు విడిచాడు.మరో పది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఇంకా గుర్తించాల్సి ఉందని సీనియర్ పోలీసు అధికారి నాగేంద్ర సింగ్ తెలిపారు.