చిత్తూరు జిల్లా ఏర్పేడు వుండలం సీతారాంపేట వద్ద శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు.
ఏర్పేడు: చిత్తూరు జిల్లా ఏర్పేడు వుండలం సీతారాంపేట వద్ద శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా దాచేపల్లి వుండలం గంగిరెడ్డి పాలేనికి చెందిన వూమిడి వెంకటేశ్వర్లు, ఆయున బంధువులు తిరుమలకు టవేరా వాహనంలో శుక్రవారం సాయుంత్రం బయులుదేరారు. డ్రైవర్ సహా 11మంది అందులో ఉన్నారు. శనివారం తెల్లవారుజావుున సీతారాంపేట వులుపు వద్దకు రాగానే వాహనాన్ని తమిళనాడులోని రాణిపేట నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళుతున్న కంటైనర్ ఢీకొంది. టవేరాలో ఉన్న ఆరుగురు మృతిచెందగా, అయిదురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.