అఫ్గనిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగి పోయారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిపలువురు అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు.
కాబుల్: అఫ్గనిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగి పోయారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిపలువురు అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. లోఘార్ ప్రావిన్స్లో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వివరాల ప్రకారం ఒంటినిండా బాంబులు ధరించుకున్న ఓ ఉగ్రవాది రద్దీగా ఉన్న ప్రాంతంలోకి వచ్చి ఒక్కసారిగా తనను తాను పేల్చి వేసుకున్నాడు. దీంతో ఆరుగురు ప్రాణాలుకోల్పోగా పలువురు గాయాలపాలయ్యారు. దాడి విషయంలో ఏ ఉగ్రవాద సంస్థ నోరు మెదపలేదు.