ఆత్మాహుతి దాడి: 12 మంది మృతి | 12 Killed In Jalalabad Suicide Bomb Attack | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడి: 12 మంది మృతి

Published Wed, Jul 11 2018 4:01 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

12 Killed In Jalalabad Suicide Bomb Attack - Sakshi

ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతం

కాబుల్‌ : తూర్పు అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందగా, నలుగురు గాయాలపాలయ్యారు. చెక్‌ పోస్టు వద్ద ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది అమరులైనట్లు నానాఘర్‌ ప్రావిన్సు గవర్నర్‌ పేర్కొన్నారు.

బాంబు విస్ఫోటన ధాటికి దగ్గరలోని వాహనాలు, షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దాడికి పాల్పడింది ఎవరో ఇంకా తెలియరాలేదు. కాగా, ఈ నెల 1వ తేదీన జలాలాబాద్‌లోనే జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement