
జలాలాబాద్: అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్ పట్ణణంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మరణించారు. మృతుల్లో 12 మంది సిక్కులు కాగా, ఏడుగురు హిందువులున్నారు. మరో 20 మంది గాయపడ్డారు. నాన్‌ఘర్హర్ ప్రావిన్సు గవర్నర్ కార్యాలయానికి సమీపంలోని మార్కెట్‌లో దుండగుడు తనని తాను పేల్చేసుకున్నాడు. ఆ సమయంలో గవర్నర్ కార్యాలయంలో అధ్యక్షుడు అష్రాఫ్ గనీ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో మైనారిటీ వర్గాలైన సిక్కులు, హిందువులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందా? అన్నదానిపై స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment