
ఎయిర్‌పోర్ట్ వర్కర్లపై కాల్పులు
కాబుల్: ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌లో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వాహనంపై గుర్తు తెలియని దుండగుడు బుల్లెట్ల వర్షం కురిపించడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలతో పాటు డ్రైవర్ మతి చెందాడు.
మృతి చెందిన ఐదుగురు మహిళలను ఎయిర్ పోర్ట్ వర్కర్లుగా గుర్తించారు. ఎయిర్ పోర్టు ఉద్యోగుగులు విధులకు వెళ్తున్న సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడన్న విషయం తెలియరాలేదు. తాలిబాన్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు.