
లండన్: ఇంగ్లండ్‌లోని ప్లేమౌత్ నగరంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లేమౌత్‌లోని కేమాన్ అనే ప్రాంతంలో గురువారం సాయంత్రం దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు, జరిపి తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతిచెందారు. దుండగుడితో సహా మొత్తం ఆరుగురు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దేశంలో గత పదేళ్లలో ఇదే అతి పెద్ద కాల్పుల ఘటన అని పేర్కొన్నారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి సైతం ఉందని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని జేక్ డెవీసన్(22)గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment