రాయగడ్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి చెందారు. కాంకేర్ జిల్లా బాందే పోలీస్ స్టేషన్ పరిధిలోని పారల్కోట్ గ్రామం సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
ఎదురు కాల్పుల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవినాష్ శర్మతో పాటు, అసిస్టెంట్ కానిస్టేబుల్ సోను అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన బీఎస్ఎఫ్ జవాన్లను గుర్తించాల్సి ఉంది. కాగా గాయపడిన మరో ముగ్గురు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తరలించినట్లు ఇంటిలిజెన్స్ వింగ్ ఐజీ తెలిపారు.