
అమ్మో.. హెలికాప్టర్ బొమ్మ!
విధి వక్రిస్తే మరణం ఎంత చిత్రంగా ఉంటుందో అమెరికాకు చెందిన 19 ఏళ్ల రోమన్ పిరోజెక్ అనే యువకుడి విషయంలో రుజువైంది. పిరోజెక్ ఓ హెలికాప్టర్ ఢీకొనడంతో మరణించాడు. ఏముంది ఇందు లో..? హెలికాప్టర్ ఢీకొన్నాక ఉంటారా? అనుకుంటారు కదూ.. కానీ, ఢీకొన్నది నిజం హెలికాప్టర్ కాదు... బొమ్మ హెలికాప్టర్! బ్రూక్లిన్ పట్టణంలో గురువారం పిరోజెక్ గాల్లో ఎగిరే ఎలక్ట్రానిక్ హెలికాప్టర్‌తో విన్యాసాలు చేయిస్తున్నాడు.
కొద్దిసేపటికి అది అదుపుతప్పి నేరుగా దూసుకువచ్చి ఆయన తలను బలంగా ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మరణించాడు. మరో విషయం ఏమిటంటే.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకునేందుకు కొంతకాలం పాటు బ్రూక్లిన్ పట్టణంలో ఎలక్ట్రానిక్ హెలికాప్టర్లను గాల్లో తిప్పడంపై నిషేధం విధించనున్నారు.