న్యూఢిల్లీ: చైనాతో లింకులున్న భారతీయ సంస్థలపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చైనా గ్రూప్‌తో గల సంబంధాలను దాచిపెట్టినందుకు గాను మెటెక్ ఎలక్ట్రానిక్స్‌కు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) రూ. 21 లక్షల జరిమానా విధించింది.
అలాగే, చైనా, హాంకాంగ్‌కు చెందిన మెటెక్ గ్రూప్‌తో కొత్తగా ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని ఆదేశించింది. ఇద్దరు విదేశీయులు, ఒక భారతీయుడు షేర్‌హోల్డర్లుగా ఒక స్టాండెలోన్ సంస్థలాగా మెటెక్ ఎలక్ట్రానిక్స్ నమోదు చేసుకుంది.
ఉత్పత్తుల కొనుగోలు కోసం తప్ప చైనాకు చెందిన మెటెక్ గ్రూప్‌తో తమకు ఎటువంటి సంబంధాలు లేవని చెబుతోంది. అయితే, వాస్తవానికి మెటెక్ గ్రూప్‌లో భాగంగానే అది పని చేస్తున్నట్లు వెల్లడైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో కంపెనీతో పాటు సంబంధిత వ్యక్తులకు ఆర్‌వోసీ జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment