భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగివుంది. ఈ విషయంలో భారతీయ రైల్వే నాల్గవ స్థానంలో ఉంది. వీటిలో కొన్ని రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలంలో నిర్మితమయ్యాయి. అవి ఎక్కడ ఉన్నాయో, ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటో ఓ లుక్కేద్దాం.
భారతీయ రైల్వే ప్రస్తుతం 7 వేలకుపైగా రైల్వే స్టేషన్లను కలిగివుంది. వీటి మీదుగా 13 వేలకు మించిన రైళ్లు నడుస్తుంటాయి. దీనితో పాటు ఈ రూట్లలో గూడ్సు రైళ్లు కూడా నడుస్తుంటాయి. భారత్‌లో రైల్వే వ్యవస్థ.. బ్రిటీషర్లు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఏర్పడింది. నాడు నిర్మితమైన రైల్వే స్టేషన్లు ఇవే..
హౌరా రైల్వేస్టేషన్
హౌరా రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పట్టణంలోని ప్రముఖ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి తొలి రైలు 1854 ఆగస్టు 15న తన రాకపోకలు ప్రారంభించింది. ఈ రైలు హౌరా-హుబ్లీల మధ్య నడిచేది. ఇది మన దేశంలో ఏకంగా 23 ప్లాట్‌ఫారాలు కలిగిన అతిపెద్ద రైల్వే స్టేషన్.
రాయ్‌పూర్ రైల్వేస్టేషన్
చెన్నై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ పరిధిలోని వాలాజాపేట విభాగంలో ఉన్న రాయపూర్ రైల్వేస్టేషన్‌ను బ్రిటీషర్లు నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి 1856లో దక్షిణభారతానికి చెందిన తొలి రైలు నడిచింది. ప్రస్తుతం ఇది దక్షిణ మరాఠా- మద్రాస్‌కు కేంద్ర కార్యాలయంగా ఉంది.
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయన్ రైల్వే స్టేషన్
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయన్ రైల్వే స్టేషన్‌ను గతంలో ముగల్‌సరాయ్ రైల్వే స్టేషన్ పేరుతో పిలిచేవారు. తరువాతి కాలంలో దీని పేరు మార్చారు. ఇది యూపీలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటి. బెనారస్‌కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వేస్టేషన్ ఉంది. ఈ స్టేషన్ 1862లో నిర్మితమయ్యింది.
ఛత్రపతి శివాజీ టర్మినస్
ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్ భారత్‌లోని ప్రముఖ రైల్వే స్టేషన్. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. దీని నిర్మాణం 1978లో ప్రారంభమయ్యింది. తొలుత ఈ రైల్వే స్టేషన్‌కు మహారాణి విక్టోరియా పేరు పెట్టారు. తరువాత 1996లో దీని పేరు ఛత్రపతి శివాజీ టర్మినస్‌గా మార్చారు.
డెహ్రాడూన్ రైల్వేస్టేషన్
డెహ్రాడూన్ రైల్వేస్టేషన్ ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ రైల్వేస్టేషన్. దీని నిర్మాణం 1897-1899 మధ్యకాలంలో బ్రిటీషర్ల సారధ్యంలో సాగింది. ఈ రైల్వే లైన్‌కు 1896లో అనుమతి లభించింది. 1900 మార్చి 1న ఈ రైలు ప్రారంభమయ్యింది.
లక్నో చార్‌బాగ్ రైల్వేస్టేషన్
లక్నోలోని ఐదు రైల్వే స్టేషన్లలో చార్‌బాగ్ రైల్వే స్టేషన్ ఒకటి. దీని నిర్మాణం 1914లో మొదలయ్యింది. 1923 నాటికి ఈ స్టేషన్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ స్టేషన్ డిజైన్‌ను బ్రిటీష్ ఆర్కిటెక్ జె. హెచ్ రూపొందించారు. ఈ స్టేషన్ నిర్మాణంలో భారత ఇంజినీరు చౌబె ముక్తా ప్రసాద్ కీలక బాధ్యతలు వహించారు. నాటిరోజల్లో ఈ స్టేషన్ నిర్మాణానికి రూ.70 లక్షలు ఖర్చయ్యాయి.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్
అజ్మరీ గేట్- పహాడ్‌గంజ్ మధ్య ఉన్న న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నిర్మాణానికి 1826లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతినిచ్చింది. 1931 నాటికి ఈ రైలు ప్రారంభానికి నోచుకుంది. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో మొత్తం 16 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ప్రతీరోజూ కొన్ని వందల రైళ్లు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తాయి.
నంది హాల్ట్ రైల్వే స్టేషన్
నంది హాల్ట్ రైల్వే స్టేషన్ బెంగళూరులోని యలువహళ్లిలో ఉంది. ఇది 108 ఏళ్ల క్రితం బ్రిటీషర్ల కాలంలో నిర్మితమయ్యిందని చెబుతారు.
ఇది కూడా చదవండి: డ్రోన్లతో రోడ్డు ప్రమాదాలకు చెక్ ?
Comments
Please login to add a commentAdd a comment