ఏపీలో పోలీస్ బాస్ల ప్రయత్నాలు ఫలించాయి. గుంటూరు రేంజి పరిధిలో 86 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గుంటూరు: ఏపీలో పోలీస్ బాస్ల ప్రయత్నాలు ఫలించాయి. గుంటూరు రేంజి పరిధిలో 86 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూర్ రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని 79 మంది సీఐలను బదిలీ చేస్తూ ఈనెల 4వ తేది రాత్రి ఐజీ పీవీ సునీల్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కొందరు ప్రజాప్రతినిధుల జోక్యంతో ఆ బదిలీలు నిలిచిపోయాయి. సీఎం కార్యాలయం నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి మౌఖిక ఆదేశాలు అందడంతో బదిలీలను నిలుపుదల చేసినట్లు సమాచారం.
విధుల నుంచి రిలీవ్ అయిన వారు తదుపరి ఉత్తర్వులు అందేంతవరకూ విధుల్లో చేరవద్దని ఉన్నతాధికారులు బదిలీపై రిలీవ్ అయిన సీఐలను ఆదేశించినట్లు తెలిసింది. ఎట్టకేలకు మరో ఏడుగుని కలిపి మొత్తం 86 మంది సీఐలను బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
**