CIs transfer
-
ముడుపులు తేలక మల్లగుల్లాలు
చిత్తూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మద్యం పాలసీ అటు సర్కారు ఖజానా నింపడమే కాదు.. కూటమి నేతలకూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో జరుగుతున్న సీఐ బదిలీలే ఇందుకు కారణం. ఈ వారంలోనే నూతన మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతకుముందే ఎక్సైజ్ సీఐల బదిలీలు పూర్తిచేయాలని భావిస్తోంది. దీంతో మద్యం అమ్మకాల్లో రాష్ట్రస్థాయిలోనే పేరున్న సర్కిళ్ల కోసం అధికారులు పోటీపడుతున్నారు. ఎందుకంటే.. మద్యం అమ్మకాలు బాగా జరిగితేనే సిండికేట్ల ఏర్పాటు, ఎమ్మారీ్పకి గండి కొట్టడం సాధ్యమవుతుంది.ఈ పనులన్నీ జరగాలంటే తాము చెప్పిన సీఐ ఉంటేనే సాధ్యమని ప్రజాప్రతినిధులు ఈ బదిలీల్లో తలదూరుస్తున్నారు. కానీ, రాయలసీమలోని జోన్–4 పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల సీఐల బదిలీలు కొలిక్కిరాలేదు. నాయకులకు ముట్టాల్సిన ముడుపులు ముట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పంచాయతీ తేలకపోవడంతో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం బదిలీల ఉత్తర్వులు ఇచ్చేయడానికి సిద్ధపడింది. అయితే, సీమలోని కూటమి నేతల నుంచి కమిషనర్ కార్యాలయానికి హెచ్చరికలు వెళ్లినట్లు ఎక్సైజ్ శాఖలో చర్చించుకుంటున్నారు.తేలని సీఐల పోస్టింగ్లుఇక రాష్ట్రంలోని విశాఖ, నెల్లూరు, కృష్ణాలోని మూడు జోన్లలో శనివారం రాత్రి బదిలీల ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలింది జోన్–4 మాత్రమే. మూడు జోన్లతో పాటు చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో సీఐల బదిలీల ఉత్తర్వులు సైతం శనివారమే విడుదల కావాల్సింది. కానీ, కూటమి నేతలు తమకు అనుకున్న స్థాయిలో ముడుపులు రాలేదన్న కారణంతో సీఐల పోస్టింగులపై తేల్చలేదు. ప్రధానంగా తిరుపతి అర్బన్, చంద్రగిరి, డిస్టిలరీ, పలమనేరు, నగరి, గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు భారీ ధర పలుకుతోంది. ఇక కడప అర్బన్, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కర్నూలు అర్బన్, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, అనంతపురం అర్బన్, హిందూపురం, కదిరి, ధర్మవరం, ఉరవకొండ సర్కిళ్లకు సైతం డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లో పనిచేయడానికి పలువురు సీఐలు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.ఫలితంగా స్థానిక ఎమ్మెల్యేలు వాళ్లకు కావాల్సింది తీసుకుని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌కు సిఫార్సు లేఖలపరంగా.. కొన్నిచోట్ల మంత్రులు వాటికి అడ్డుకట్ట వేస్తూ తమ సిఫార్సు లేఖలు ఇచ్చేశారు. దీంతో ఎవర్ని ఎక్కడ వేయాలో తెలీక కమిషనర్ కార్యాలయం తల పట్టుకుంటోంది. ఇప్పటికే అనంతపురంలోని ఓ ఎమ్మెల్యేను కమిషనర్ కార్యాలయంలోని ఓ అధికారి సంప్రదించి, మంత్రి చెప్పిన వాళ్లకు పోస్టింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. అగ్గిమీద గుగ్గిలమైన ఆ నేత, తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని చీవాట్లు పెట్టినట్లు సమాచారం.దీంతో.. రాయలసీమలోని బదిలీల వ్యవహారం తేల్చడం తమవల్ల కాదంటూ కమిషనర్ కార్యాలయం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఆబ్కారీ శాఖ మంత్రి దృష్టికి వెళ్లినా ఆయన మాట కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు వినడంలేదని తెలుస్తోంది. మరికొన్ని సర్కిళ్లలో నేతల రేటుకు సీఐలు సరితూగకపోవడంతో బదిలీల్లో సందిగ్థత నెలకొంది. ఆదివారం ఈ పంచాయతీ చినబాబు వద్దకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సర్కిళ్లకు నిర్ణయించిన ధరలు తగ్గుతాయా, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖల్లో ఎవరివి చెల్లుతాయో అన్న దానిపై ఎక్సైజ్ శాఖలో ఆసక్తి నెలకొంది. -
అమ్మో.. బెజవాడే
భయపడుతున్న ఎక్సైజ్ సీఐలు నగరంలో ఉద్యోగం కష్టమంటున్న అధికారులు బదిలీల్లో నగరానికి నో ఆప్షన్ జిల్లాలో 25 మంది సీఐల బదిలీ సాక్షి, విజయవాడ : అమ్మో విజయవాడలో పనిచేయటం చాలా కష్టం.. వారంలో నాలుగు రోజులు మంత్రి ప్రోటోకాల్, మిగిలిన మూడు రోజులు ఇతర వీవీఐపీల పోటోకాల్ విధులు ఉంటాయి. ఇవి కాకుండా రెగ్యులర్‌గా తనిఖీలు, నెలకు సగటున 10 వరకు కేసుల నమోదు చేయాల్సి ఉంటుంది. సరే కష్టపడి పనిచేసినా పెద్దగా ఆర్థికంగా ఉపయోగం ఉండదు. డబ్బు ప్రోటోకాల్ ఖర్చులకే సరిపోవు. అందుకే విజయవాడ కంటే పక్కన ఉన్న మునిసిపాలిటీలే బాగుంటాయి. ఇది ఎక్సైజ్ శాఖలోని సిఐలు మనోగతం. గురువారం జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ సీఐల బదిలీలు జరిగాయి. నిబంధనలతో తంటా.. సాధారణంగా జిల్లాలో పనిచేసే ఎక్సైజ్ సిఐలు ఆదాయం బాగుంటుందని విజయవాడలోని పోస్టింగ్‌ల కోసం విస్తృతంగా ప్రయత్నించే వారు. అవసరాన్ని బట్టి రూ 4 లక్షల నుంచి 6 లక్షల వరకు అయినా ఖర్చు పెట్టి మరీ నగరంలో పోస్టింగ్ తెచ్చుకునే వారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎక్సైజ్ శాఖ సీఐల పనితీరుకు కొలమానం పెట్టింది. ఎ నుంచి డి వరకు నాలుగు గ్రేడ్లుగా పనితీరు ఆధారంగా బదిలీలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఎగ్రేడ్ సాధించిన వారికి మాత్రమే నగరంలో పోస్టింగ్‌లు కేటాయిస్తారు. అయితే ఎ-గ్రేడ్ ఒక సీఐకు మాత్రమే రావటంతో బిగ్రేడ్ ఉన్న ముగ్గురినీ నగరంలో వేయాల్సి ఉంది. అయితే బి గ్రేడ్‌లో ఉన్నసీఐలు నగరంలో పోస్టింగ్ వద్దని ఉన్నతాధికారులకు మెరపెట్టుకున్నారు. దీంతో నగరంలోని నాలుగు సీఐ పోస్టులనూ గతంలో లూప్లైన్లో పనిచేసిన వారికి కేటాయించారు. ఈ క్రమంలో గురువారం జిల్లాలో 23 మంది సీఐల బదిలీలు జరిగాయి. పదవీకాలం పూర్తి కాలేదని ఉయ్యూరు సీఐని మినహాయించారు. మచిలీపట్నం సీఐ పోస్టును భర్తీ చేశారు. ఏఈఎస్ భీమ్‌రెడ్డిని పలాసకు బదిలీ చేశారు. నూతన సీఐలు వీరే... మచిలీపట్నానికి జయశ్రీ, బంటుమిల్లికి ఎన్. అమరేశ్వరరావు, అవనిగడ్డకు ఎస్.కె. రమేష్, మొవ్వకు ఎం. సూర్యప్రకాషరావు, గుడివాడకు వరహాలరాజు, కైకలూరుకు ఎన్.వి. రమేష్, మండవల్లికి పి.జయరామ్, గన్నవరానికి పాండురంగారావు, విజయవాడ ఈస్ట్‌కు పి.వి. రమణ, విజయవాడ వెస్ట్‌కు కె.వి. సుధాకర్, పటమటకు ఎం. కృష్ణకుమారి, భవానీపురానికి జె. రమేష్ బదిలీ అయ్యారు. మైలవరానికి జి. శ్రీనివాస్, నందిగామకు సాయి స్వరూప్, కంచికచర్లకు ఆర్.వి. రామ శివ, నూజివీడుకు జె. శ్రీనివాస్, తిరువూరుకు బి. నాగహనుమాన్, విసన్నపేటకు జి. అమర్‌బాబు, మచిలీపట్నం ఈఎస్ టాస్క్‌ఫోర్స్‌కు కె. బంగారు రాజు, విజయవాడ ఈఎస్ టాస్క్‌ఫోర్స్‌కు అబ్దుల్ ఖదీర్, లిక్కర్ డిపోకు సీఎస్ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. -
ఫలించిన పోలీస్ బాస్‌ల ప్రయత్నాలు
గుంటూరు: ఏపీలో పోలీస్ బాస్‌ల ప్రయత్నాలు ఫలించాయి. గుంటూరు రేంజి పరిధిలో 86 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూర్ రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని 79 మంది సీఐలను బదిలీ చేస్తూ ఈనెల 4వ తేది రాత్రి ఐజీ పీవీ సునీల్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కొందరు ప్రజాప్రతినిధుల జోక్యంతో ఆ బదిలీలు నిలిచిపోయాయి. సీఎం కార్యాలయం నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి మౌఖిక ఆదేశాలు అందడంతో బదిలీలను నిలుపుదల చేసినట్లు సమాచారం. విధుల నుంచి రిలీవ్ అయిన వారు తదుపరి ఉత్తర్వులు అందేంతవరకూ విధుల్లో చేరవద్దని ఉన్నతాధికారులు బదిలీపై రిలీవ్ అయిన సీఐలను ఆదేశించినట్లు తెలిసింది. ఎట్టకేలకు మరో ఏడుగుని కలిపి మొత్తం 86 మంది సీఐలను బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. **