గుంటూరుకు ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు | Medico sandhyarani suicide case: Prof Lakshmi couple bring guntur | Sakshi
Sakshi News home page

గుంటూరుకు ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు

Published Tue, Nov 15 2016 9:36 AM | Last Updated on Tue, Oct 9 2018 7:18 PM

గుంటూరుకు ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు - Sakshi

గుంటూరుకు ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు

గుంటూరు : పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి బలవన్మరణం కేసులో నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున గుంటూరు తీసుకు వచ్చారు. వీరిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లక్ష్మితో పాటు ఆమె భర్త డాక్టర్ విజయసారథిని పోలీసులు సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు బెంగళూరులోని ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు  సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీస్ బృందం నిన్న దాడి చేసి వీరిని అరెస్టు చేసింది. వీళ్లు పోలీసులకు దొరక్కుండా 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాలు చుట్టేశారు. పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారితో పాటు, ఓ రిటైర్డ్ జడ్జి, అధికార నేతల సలహా మేరకే బెయిల్ వచ్చే వరకూ పోలీసులకు దొరకకూడదని వీరు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కాగా ప్రొఫెసర్ లక్ష్మిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం బూటకమని,  బెయిల్పై జిల్లా కోర్టు, హైకోర్టులో ఆమెకు చుక్కెదురు అవడంతో గత్యంతరం లేని స్థితిలోనే ఆమె పోలీసులకు లొంగిపోయిందని న్యాయవాది వైకే ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement