గుంటూరు: గుంటూరు జిల్లా నగరం మండలం దూలిపుడి వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యాన్ని, ఆటోను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించి... సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.