కానిస్టేబుళ్ల కీచక పర్వంపై పోలీసు ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. బాధితురాలి ఫిర్యాదు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు.
గుంటూరు: కానిస్టేబుళ్ల కీచక పర్వంపై పోలీసు ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. బాధితురాలి ఫిర్యాదు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఒకవేళ బాధితురాలు ఫిర్యాదు ఇవ్వకుంటే సుమోటోగా కేసు నమోదు చేయాలని సూచించారు. సంఘటన జరిగిన సమీపంలోని ఓ కార్యాలయం వెలుపల ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఈ సాయంత్రానికి అరెస్ట్ చేసే అవకాశముంది.
రాత్రి గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్, హోంగార్డు ఓ యువతిని బెదిరించి అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. యువతికి తోడుగా ఉన్న యువకుడిని తరిమేసి వారీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో రాజీ కుదిర్చిన కొత్తపేట ఎస్సై కూడా చర్య తీసుకునే అవకాశముంది.