
యువతి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
గుంటూరు : తాడేపల్లి బైపాస్ రోడ్డులో గురువారం ఓ యువతి కిడ్నాప్ పేరిట కలకలం సృష్టించింది. తీరా సాయంత్రానికి అదేం కాదు అతనూ, నేనూ ప్రేమికులమే..అతడిని వదిలేయమంటూ ప్రాధేయపడింది. వివ రాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బొబ్బి లికి చెందిన యువతి కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటూ డాన్స్ వృత్తిలో జీవనం సాగి స్తోంది.
ఇటీవల ఆర్గనైజర్‌కు, సదరు యువతికి గొడవ కావడంతో గుంటూరులో బంధువుల ఇంట్లో ఉంటోంది. గురువారం ఓ యువకుడు బలవంతంగా ద్విచక్రవాహనంపై లాక్కొచ్చాడంటూ బైపాస్ రోడ్డులో హడావుడి సృష్టించింది. విజయవాడ 1టౌన్ సీఐ గుంటూరు నుంచి వస్తూ వీరిద్దరి గలాటా చూసి, ప్రశ్నించగా, ఇతను నన్ను కిడ్నాప్ చేసి, బలవంతంగా లాక్కొస్తున్నాడంటూ తెలిపింది. దీంతో సీఐ ఇద్దరిని తన వాహనంలో తీసుకువచ్చి తాడేపల్లి పోలీసులకు అప్పగించారు.
మొదట అతను ఎవరో నాకు తెలియదని, నాకు సంబంధం లేదని చెప్పింది. తాను ఆమె భర్తనని, తమఇద్దరిదీ ప్రేమ వివాహమని చెప్పాడు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నా రు. బొబ్బిలిలో ఉన్న యువతి తండ్రికి సమాచారం ఇచ్చారు. సాయంత్రానికల్లా సదరు యువతి వచ్చి తమ ఇద్దరిదీ ఒకే ఊరని, తామిద్దరూ ప్రేమించుకున్నామని, తరచూ గొడవలు పడుతుంటే కోపంతో అతనెవరో తెలియదని చెప్పానని, అతడిని వదిలేయమని ప్రాధేయపడింది. తల్లిదండ్రులు వస్తే పంపిస్తామని పోలీసులు చెప్పారు.