వైఎస్ జగన్ దీక్షకు అనుమతి ఇవ్వండి | ysrcp leaders meet guntur urban sp | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ దీక్షకు అనుమతి ఇవ్వండి

Published Wed, Sep 23 2015 7:03 PM | Last Updated on Tue, Aug 21 2018 4:18 PM

ysrcp leaders meet guntur urban sp

గుంటూరు :  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు ఉల్ఫ్ గ్రౌండ్లో అనుమతి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు గుంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠిని కలిశారు. బుధవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు తదితరులు బుధవారం సాయంత్రం ఎస్పీని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే అనుమతి నిరాకరించినట్లు ఎస్పీ తెలిపారు. దీక్షకు అనుమతిపై మరోసారి దరఖాస్తు ఇస్తే పరిశీలిస్తామని  ఎస్పీ  త్రిపాఠి ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేతలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement