tripati
-
ముంబైలో 10 ఎకరా లో శ్రీవారి ఆలయానికి భూమి పూజ
-
ఐరాసలో భారతీయుడికి కీలక పదవి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) న్యూయార్క్ కార్యాలయం అధిపతి, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా భారత్‌కు చెందిన సీనియర్ ఆర్థికవేత్త సత్య త్రిపాఠి ఎంపికయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ ఆయన్ని ఈ పదవిలో నియమించారు. ట్రినిడాడ్–టుబాగోకు చెందిన ఎలియట్ హ్యారిస్ స్థానంలో త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు. త్రిపాఠి 2017 నుంచి యూఎన్ఈపీ సుస్థిరాభివృద్ధి కార్యాచరణకు సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఒడిశాలోని బరంపుర విశ్వవిద్యాలయం నుంచి త్రిపాఠి న్యాయశాస్త్రంలో డిగ్రీ, పీజీ పట్టాలు పొందారు. -
వైఎస్ జగన్ దీక్షకు అనుమతి ఇవ్వండి
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు ఉల్ఫ్ గ్రౌండ్లో అనుమతి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు గుంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠిని కలిశారు. బుధవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు తదితరులు బుధవారం సాయంత్రం ఎస్పీని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే అనుమతి నిరాకరించినట్లు ఎస్పీ తెలిపారు. దీక్షకు అనుమతిపై మరోసారి దరఖాస్తు ఇస్తే పరిశీలిస్తామని ఎస్పీ త్రిపాఠి ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేతలకు సూచించారు.