ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్‌ఈపీ) న్యూయార్క్ కార్యాలయం అధిపతి, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా భారత్‌కు చెందిన సీనియర్ ఆర్థికవేత్త సత్య త్రిపాఠి ఎంపికయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ ఆయన్ని ఈ పదవిలో నియమించారు.
ట్రినిడాడ్–టుబాగోకు చెందిన ఎలియట్ హ్యారిస్ స్థానంలో త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు. త్రిపాఠి 2017 నుంచి యూఎన్‌ఈపీ సుస్థిరాభివృద్ధి కార్యాచరణకు సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఒడిశాలోని బరంపుర విశ్వవిద్యాలయం నుంచి త్రిపాఠి న్యాయశాస్త్రంలో డిగ్రీ, పీజీ పట్టాలు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment