పంజగుట్ట/సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాదిగల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి ఎస్సీల వర్గీకరణ అంశంపై మంద కృష్ణ మాదిగను కేంద్ర మంత్రుల వద్దకు తీసుకెళ్లడం సరికాదని అన్నారు. కిషన్‌రెడ్డి ఇలాంటి చర్యలు మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా 200 మందితో నామినేషన్ వేయిస్తామని హెచ్చరించారు.
సోమవారం మాల మహానాడు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంఆర్‌పీఎస్ నాయకులు, మాలలు తక్కువగా ఉన్నారని, మాదిగలు 12 శాతం ఉన్నారని ప్రచారం చేస్తున్నారని దమ్ముంటే మాలలు, మాదిగలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మాలలను జాగృతం చేసి మాలల శంఖారావం పేరిట సదస్సు నిర్వహిస్తామని చెన్నయ్య వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment