
ఖైరతాబాద్ః తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన మహాధర్నా, నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. మింట్ కాంపౌండ్‌లోని అంబేడ్కర్ స్ఫూర్తి భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కాలం చెల్లిన డిమాండ్ అని, ఎస్సీలను వర్గీకరించొద్దని కోరుతూ కేంద్ర మంత్రులు, ఎస్సీ కమిషన్ జాతీయ చైర్మన్, పార్లమెంట్ పక్ష వైఎస్సార్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ మహిళా ఎంపీలను కలసి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.