Chalo Delhi program
-
9న చలో ఢిల్లీ–పార్లమెంట్ ముట్టడి
ముషీరాబాద్ (హైదరాబాద్): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, జన గణనలో కుల గణన చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశాకు చెందిన ముఖ్య బీసీ నాయకుల సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ కృష్ణ, తెలంగాణ బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు లాల్‌కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కృష్ణయ్య చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి, వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులను కలవడం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం లాంటి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఉన్న కుల గణన కేసును వేగవంతం చేయాలని కోరారు. కుల గణన జరపాలని 8 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేశాయని, 16 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. రెండు రాష్ట్రాలకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్‌ను స్తంభింపజేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రాజ్‌కుమార్, అనంతయ్య, రామకృష్ణ, ఉదయ్, చంటి, తరుణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఛలో ఢిల్లీ విజయవంతం: చెన్నయ్య
ఖైరతాబాద్ః తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన మహాధర్నా, నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. మింట్ కాంపౌండ్‌లోని అంబేడ్కర్ స్ఫూర్తి భవన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కాలం చెల్లిన డిమాండ్ అని, ఎస్సీలను వర్గీకరించొద్దని కోరుతూ కేంద్ర మంత్రులు, ఎస్సీ కమిషన్ జాతీయ చైర్మన్, పార్లమెంట్ పక్ష వైఎస్సార్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ మహిళా ఎంపీలను కలసి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. -
ప్రజావ్యతిరేక విధానాలపై ధర్నా
సంగారెడ్డి జోన్: దేశంలో మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 5న జరిగే ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ హేమలత అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని బాలాజీ మంజీరా గార్డెన్స్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘ప్రత్యామ్నాయ ఆర్థిక రాజకీయ విధానాలు– కార్మికవర్గం పాత్ర’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు, కూలీలు, రైతులందరితో లక్షలాది మంది కలిసి దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలియజేస్తామని, మోదీ పాలన లో అచ్చేదిన్‌లన్ని , కార్పొరేట్, పెట్టుబడిదార్లకే వచ్చాయన్నారు. కార్మికుల ఐక్యతను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందన్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో కేంద్రం కొత్త సవరణను ముందుకు తెచ్చి కార్మికులకు , ఉద్యోగులకు భద్రత లేకుండా చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసిందని, ఇన్సూరెన్స్ , బ్యాంకింగ్, రైల్వే, రక్షణ, ఫార్మా రంగాలను పూర్తిగా బలహీనం చేస్తుందన్నారు. ఉద్యోగ భద్రత, వేతనం, పనిహక్కు సామాజిక భద్రత కోసం అమలవుతున్న బెనిíపిట్స్ స్థానంలో బీమా ఆధారిత విధానాన్ని తెచ్చిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మిక చట్టాలను సవరించి అమలు చేస్తూ ఆ విధానాలనే దేశ వ్యాప్తంగా చేయడం కోసం ప్రయత్నిస్తుందన్నారు. అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు కె.రాజయ్య , బి. మల్లేశంలు మాట్లాడుతూ మన బతుకులు బాగు చేసే విధంగా ఈ ప్రభుత్వాల మీద పోరాడాలని, అందుకు పాలకులు సహకరించకపోతే నేటి పాలకులనే మార్చుకోవాలన్నారు. మన కోసం పని చేసే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను బలపర్చాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం– సమగ్రాభివృద్ధి అనే ఏజెండాను నిజమైన అర్థంలో అమలు చేసేందుకు తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాజకీయ వేదిక ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు బాగారెడ్డి, నాయకులు ఎస్.మహిపాల్, పి.మంగ, జయరాజు, యాదగిరి, స్వాతి, నాగేశ్వర్రావు, మొగులయ్య, బాలరాజు, పెంటయ్య, మౌలాలీ, వెంకటరాజం, యాదయ్య, శ్రీధర్, నాగభూషణం అరుణ, వీరమణి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకుడు వెంకయ్య మృతి
ఆనందపేట (గుంటూరు) : చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు నుంచి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎల్. వెంకయ్య సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందినట్లు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఎం.ముత్యాలరావు వెల్లడించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గల మహత్మా గాంధీ సమాధిని సందర్శించుకొని బయటకు వస్తున్న సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వెంటనే లోక్‌నాయక్ తిలక్ అసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పారు. ప్రదేశ్ కాంగ్రెస్ ఖర్చులతో ఆయన మృతదేహన్ని విమానంలో మంగళవారం గుంటూరుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. వెంకయ్య మృతికి పీసీసీ అధ్యక్షుడు ర ఘువీరరెడ్డి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, గుంటూరు జిల్లా పార్టీ ఇన్చార్జ్ కనుమూరి బాపిరాజు, జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జున రావు, మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ వలి, చదలవాడ జయరాంబాబు, షేక్ మౌలాలి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతాపం తెలిపారు.