► మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్లలో మాలలు మూడో వంతు ప్రయోజనాలను పొందుతున్నారని స్వామి అగ్నివేష్ నిజాలను వక్రీకరిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విమర్శించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు చేపట్టిన ఆందోళన మంగళవారం 20వ రోజుకు చేరుకుంది.
చెన్నయ్య మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్ సూచనల మేరకు బిహార్‌లో నితీశ్ ప్రభుత్వం.. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించకుండా ఎస్సీలలో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందన్నారు. ఉషామెహ్రా కమిషన్ నివేదిక ప్రకారం మాలల కంటే మాదిగలు రెండు రెట్లు ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలు పొందుతున్నారని చెన్నయ్య తెలిపారు.