
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న హలో మాల.. చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు మాల మహానాడు జాతీయ అ«ధ్యక్షుడు జి.చెన్నయ్య తెలిపారు. లక్షలాది మంది మాలలతో కలసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు.
సోమవారం ఆయన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన పార్టీలకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాలలు తగురీతిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడమే మాలల లక్ష్యమని అన్నారు. వర్గీకరణను వ్యతిరేకిస్తున్న యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి, బీజేపీ మంత్రి రాందాస్ అత్వాలేకు ప్రత్యేక కృతజ్ఞతలు