ప్రేమించి.. పెళ్లి చేసుకుని.. | The couple committed suicide by jumping in the pond | Sakshi
Sakshi News home page

ప్రేమించి.. పెళ్లి చేసుకుని..

Published Tue, Nov 29 2016 3:31 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ప్రేమించి.. పెళ్లి చేసుకుని.. - Sakshi

ప్రేమించి.. పెళ్లి చేసుకుని..

  • ఐదు నెలలకే అనంతలోకాలకు..
  • చెరువులో దూకి దంపతుల ఆత్మహత్య
  • ప్రాణాలు తీసిన క్షణికావేశం
  • అమృతాపూర్‌లో విషాదం
  • డిచ్‌పల్లి : ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఐదు నెలలకే వారికి నూరేళ్లు నిండారుు. క్షణికావేశం ఆ దంపతుల ప్రాణాలు తీసింది. చిన్న గొడవ కారణంగా ఇద్దరు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఈ విషాదకర సంఘటన డిచ్‌పల్లి మండలం అమృతాపూర్‌లో చోటు చేసుకుంది. సీఐ తిరుపతి, ఎస్సై కట్టా నరేందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మాజీ సర్పంచ్ దువ్వ ల పెద్ద గంగారాం, అబ్వవ్వ దంపతుల చిన్న కుమారుడు చిన్న గంగారాం(25) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన తేలు బాలయ్య, చిన్నుబారుు దంపతుల కూతురు రోజా(21) బీడీలు చుడుతుంది. చిన్నగంగారాం, రోజా సుమారు ఐదేళ్లు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరనే భయంతో గత జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

    గంగారాం కుటుంబ సభ్యులు రానివ్వకపోవ డంతో కొద్ది రోజులు పక్క గ్రామమైన గొల్లపల్లిలో, మరి కొద్ది రోజులు నిజామాబాద్ నగరంలో ఉన్నారు. మూడు నెలల క్రితం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. రోజా తల్లిదండ్రుల సహకారంతో ఒక గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరు రోజా తల్లి గారింటికి వెళ్లి భోజనం చేసి తిరిగి నివాసానికి వచ్చారు. రాత్రి పది గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో చిన్న గంగారాం రోజాపై చేరుు చేసుకున్నాడు. దీంతో రోజా చనిపోతానని ఏడ్చుకుంటూ సమీపంలోని చెరువు వద్దకు పరుగెత్తిందని, వెనకే వెళ్లిన చిన్న గంగారాం చెరువుకట్టపై ఆమెను అడ్డుకున్నాడని స్థానికులు తెలిపారు.

    చెరువు కట్టపై తిరిగి ఇద్దరు గొడవ పడ్డారు. క్షణికావేశంలో రోజా చెరువులో దూకింది. ఆమె వెనకే చిన్న గంగారాం సైతం చెరువులో దూకాడు. ఇద్దరు నీటి లో మునిగి ప్రాణాలు విడిచారు. సోమవారం ఉదయం రోజా తల్లి చిన్నుబారుు గుడిసె వద్దకు వెళ్లి చూడగా కూతురు, అల్లుడు కనిపించలేదు. ఇంతలో చెరువు వద్దకు వెళ్లిన గ్రామస్తులకు చెరువులో గంగారాం మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న డిచ్‌పల్లి సీఐ, ఎస్సై గ్రామానికి చేరుకున్నారు. చెరువులో నుంచి ఇద్దరి మృతదేహాలను  వెలికి తీరుుంచారు.

    మృతదేహాలను చూసిన రెండు కుటుంబాల సభ్యులు బోరున విలపించారు. గంగారాం, రోజాలు ఒకరిని విడిచి ఒకరు ఉండే వారు కాదని, చివరకు చావును సైతం ఇద్దరు కలిసే పంచుకున్నారని గ్రామస్తులు కంటతడిపెట్టారు. గుడిసెను పరిశీలించిన పోలీసులకు మంచంపై పగిలిన గాజులు కనిపించారుు. దీంతో దంపతులిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందని సీఐ, ఎస్‌సైలు ప్రశ్నించినా రెండు కుటుంబాల వారు తమకు తెలియదని సమాధానం చెప్పారు. రోజా తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement