ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, చెన్నై(వేలూరు): ప్రేమ వివాహం చేసుకున్న ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. కేరళ రాష్ట్రానికి చెందిన గాయత్రి (32) వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంది. అదే ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న తూత్తుకుడికి చెందిన సెల్వకుమార్‌ను ప్రేమించి, నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరూ తొర్రపాడిలోని గాంధీనగర్‌లో కాపురం ఉంటున్నారు. దంపతులకు సంతానం లేక పోవడంతో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దంపతులు ఇద్దరికీ మార్చి, మార్చి డ్యూటీలు ఉండడంతో వీరు ఇద్దరూ ఇంట్లో కలిసి ఉండడం లేదు. ఇదిలా ఉండగా సెల్వకుమార్ మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు.
అక్కడ నుంచి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆదివారం సాయంత్రం భార్యకు సెల్వకుమార్ ఫోన్ చేయగా ఫోన్ తీయలేదు. దీంతో ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ సెల్వకుమార్ ఇంట్లో పరిశీలించగా అప్పటికే గాయత్రి ఒక గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించి, బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు. మహిళా డాక్టర్ సంతానం లేకపోవడంతోనే మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారా? లేక వేరే ఏమైనా కారణాలున్నాయా ?అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment